104 జంక్షన్ బి ఆర్ టి ఎస్ రహదారి వద్ద మంగళవారం కారు బీభత్సం సృష్టించించి. ప్రమాదంలో రహదారి పై వెళతున్న పాదచారుని తో పాటుగా ద్విచక్ర వహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో ప్రమాదానికి కారణమైన కారుతో పాటుగా సమీపంలో నిలిపి ఉన్న కారు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరాస జంక్షన్ నుండి కంచరపాలెం వైపు వెళ్తున్న ఒక కారు 104 జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి సమీప వాహనాలపై దూసుకుపోయింది. ప్రమాధానానికి సంబందించి సీసీ టీవి ఫుటేజులు ప్రస్తుతం వైరలు అవుతున్నాయి.
ఘటనకు సంబంధించి స్థానికులు కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కరాస నుండి బి ఆర్ టి ఎస్ రహదారి మీదుగా 104 వెళుతున్న కారు డ్రైవర్ ఉదయ్ (23) కి మూర్చ రావడంతో కారు అదుపుతప్పి రహదారి సమీపంలో నిలిపి ఉన్న వాహనాలు పైకి దూసుకుపోయింది. ప్రమాదంలో అటుగా వెళ్తున్న పాదచారుడు 104 జంక్షన్ ప్రాంతానికి చెందిన ఎండ మూరి గంగులు (42) కు తీవ్రగాయలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగ ఉందని బందువులు అంటున్నారు.ప్రమాదంలో ద్విచక్ర వహనంపై మల్కాపురం వెళ్తున్న చిన్న ముసిరివాడ ప్రాంతానికి చెందిన పోచు సత్యనారాయణ (47) కు గాయలయ్యాయి.
ఇదిలా ఉండగ కారు ఎడమవైపు కూర్చున్న కారు ఓనర్ బెల్లాన తిరుపతిరావు (54) కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు, ఎయిర్పోర్ట్ బుకోడ్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి స్థానికుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు.