ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 02:13 PM

ఒంటరితనాన్ని భరించలేక మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 88వ వార్డు పరిధి మంగళపాలెం సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో రెండేళ్లుగా నివాసం వుంటున్న సంపంగి త్రినాథ్‌ (46) ప్రైవేట్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం త్రినాథ్‌తో గొడవ పడి భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.


భార్య, పిల్లలు దూరంగా వుండడంతో ఒంటరితనాన్ని భరించలేక మనస్తాపంతో మంగళవారం ఉదయం త్రినాథ్‌ కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి అన్నయ్య రవి ఫిర్యాదు మేరకు త్రినాథ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com