ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్వాలి బాగ్‌పత్ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన బైక్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బైకుపై నలుగురు యువకులు అతివేగంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బైకు రెండు ముక్కలైంది. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa