ఇళ్ల ముందు, పార్కుల్లో పెంచే కొరియన్ కార్పెట్ గ్రాస్ కు ఇటీవల మంచి ఆదరణ లభిస్తుంది. ఈ గడ్డి సాగు చేయడానికి తొలుత ఎకరానికి రూ.50వేలు ఖర్చు అవుతుంది. కానీ రెండోసారి రూ.30వేలు సరిపోతుంది. 6 నెలల్లో పంట చేతుకొస్తుంది. ఎకరానికి దాదాపు 35 వేల షీట్ల కొరియన్ కార్పెట్ గ్రాస్ వస్తుంది. మార్కెట్ లో ఒక షీటు గడ్డిని నాణ్యతను బట్టి రూ.6 నుంచి రూ.8 వరకూ అమ్ముకోవచ్చు. అంటే ఒక ఎకరం పంటకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు.