కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వెట్టిచాకిరి పని విధానం నిర్మూలిద్దాం, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని పరిరక్షిద్దాం అని పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి టీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీ సర్కిల్ నందు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ వెట్టి చాకిరి పని విధానాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ తేజోమూర్తి, రూరల్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు నాగమధు, ఆశాబేగం, పోలీసు సిబ్బంది, పలు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.