భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజా వెంకటాద్రి బుధవారం తీర్పు చెప్పారు. పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం మార్కాపురం పట్టణానికి చెందిన ఖాదర్బాషాకు దర్శికి చెందిన మస్తాన్బీతో వివాహం జరిగింది. వారిద్దరూ దర్శిలో నివాసముంటు న్నారు. ఖాదర్బీకి వివాహేతర సంబంధం ఉన్ననేపథ్యంలో భర్త ఖాదర్ బాషాను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో మస్తాన్బీకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.