నెల్లూరు నగరంలోని హరనాథపురం సెంటర్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తోందని, ఫ్లైఓవర్ కింద వైపు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి అంటే ఏందో ఇప్పటికే చాలావరకు చేసి చూపించానని, మరికొన్ని రోజుల్లో నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రతిఒక్కరూ చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం. డి. ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, వేలూరు మహేష్, నీలి రాఘవరావు, 45వ డివిజన్ ఇంచార్జి నేతాజీ సుబ్బారెడ్డి, వై. ఎస్. ఆర్. సి. పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.