సచివాలయ కన్వీనరు, గృహసారథలు పా ర్టీకి రథసారథులని మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డి అన్నారు. డ్వాక్రా బజార్లో బుధ వారం 18 నుంచి 35 వార్డులకు చెందిన గృహ సారథులు, కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వారికి కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు షేక్ హబీబుల్లా, చైర్మన్ సీహెచ్ బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్ షేక్ ఇస్మాయిల్, అంజమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.