కర్ణాటకలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం ఓ విచిత్ర ఘటన జరిగింది. పెట్రోల్ కొట్టించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే తన భార్యలానే ఉన్న మరో మహిళను ఎక్కించుకుని వెళ్లాడు. తన భర్తలాంటి బైక్, చొక్కా ఉండటంతో తన భాగస్వామే అనుకుని ఎక్కేసింది. తీరా మన ఇల్లు ఇటుకాదు కదా అని ఆమె అడగటంతో గుర్తించిన ఆ వ్యక్తి తిరిగి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లగా అక్కడ ఆమె భర్త, అతని భార్య ఎదురుచూస్తూ ఉన్నారు. నలుగురూ హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని నవ్వుకున్నారు.