అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం ఆంధ్ర తూర్పు కనుమలలో పచ్చని ప్రకృతి ఒడిలో దాగి ఉన్నట్లుండే సహజ సిద్ధముగా ఏర్పడి అందాలకు నీలమైన బొర్రా గుహలు బౌగోళిక అద్భుతం! పూరతకమైన చరిత్రత్మక కలిగి ప్రపంచ పేరు ప్రఖ్యాత గాంచిన బొర్రా గుహలను స్థానిక ఆదివాసులు, పూర్వికులు, బొర్రా గుహలును కనుక్కొని గుహ లోపలికి చూడగా శివ మందిరం కొలువై శివుని యొక్క లీలలు, శివలింగం నందీశ్వరుని రూపం ఏర్పడి ఉందని గుర్తించారు. అక్కడనుండి శ్రీ శ్రీ శ్రీ జానకేశ్వరుడుగా కొలువై ఉన్నందున స్థానిక ఆదివాసులు, గ్రామ పెద్దలు గిరిజన సాంప్రదాయంగా గిరిజన పూజలను ఏర్పాటు చేసి ప్రతి ఏటా మహా పర్వదినన శివరాత్రులుగా బొర్రా గుహలు ప్రాంగణం నందు జాతర ఉత్సవాలు జరుపుకునేవారు. ఆ యొక్క జాతర ఉత్సవానికి భారతదేశ నలుమూల నుండి సుమారుగా 7, 8 రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి పూజలు చేసుకుని ఆనంద వేడుకలతో తిరుగు ప్రయాణం అయ్యేవారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ 1992 - 93 సం: లో బోర్రా గుహలును స్వాధీనం చేసుకుని నాటి నుండి నేటి వరకు పర్యాటకుల ప్రవేశము టికెట్ల ద్వారా టూరిజం శాఖకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకొని ఆంధ్ర రాష్ట్రమంతటా వనరులను ఖర్చు చేస్తుంది. ప్రతి ఏటా వచ్చే బోర్ర గుహలు ఆదాయాన్ని తీసుకొనిపోయి అరకు, విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. కానీ స్థానికంగా ఉండీ ఆదాయాన్ని పొంది ఇచ్చే బోర్రా గుహలుకు ఎటువంటి ఉత్సవాలు, పండగలు నిర్వహించకపోవడం స్థానిక గిరిజనులకు బాధను తెస్తుంది. బొర్రాగుహలు కి ప్రతి ఏట జరిగే మహాశివరాత్రికి రెండు రోజులుగా అధికారికంగా పండగను జరిపించండి మహాప్రభు అని ఏపీ టూరిజం శాఖకు వేడుకుంటున్నప్పటికీ ఉత్సవాల ఖర్చు చేయడానికి మా వద్ద డబ్బులు లేవని సంబంధిత పర్యాటక శాఖ చేతులెత్తేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరములో 2023 ఫిబ్రవరి 17, 18న జరిగే రెండు రోజుల బొర్రా గుహలు మహాశివరాత్రి ఉత్సవాలు జరిపించమని బొర్రా గ్రామపంచాయతీ తీర్మానంతో సమర్పించిన్నప్పటికి పర్యాటక శాఖ నుండి ఎటువంటి స్పందన, ప్రోత్సహకము కనిపించటం లేదు అంటే టూరిజనికి గిరిజనులు పైన శ్రద్ధ లేదు, అందుకని ఏపీ టూరిజం మహాశివరాత్రి ఈనెల 17, 18 ఫిబ్రవరి 2023న రెండు రోజులుగాను పండగ ఉత్సవాలు జరిపించకపోతే మా బోర్రా గుహలను బోర్రా పంచాయతీకి అప్పగించండి, అప్పుడు మేము మహాశివరాత్రి ఉత్సవాలు గిరిజన సంప్రదాయంగా రెండు రోజులు పండగ జరిపించి పర్యటకశాఖకు చూపిస్తాము, అప్పుడు మీరే ఉత్సవాలు జాతర ఎలా జరుగుతుంది చెప్పండి అని ఏపీ టూరిజనికి బొర్రా పంచాయతీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా టూరిజం ప్రోత్సహకము లేక బొర్రా గ్రామపంచాయతీ ద్వారా గా బొర్రా ఆలయ ఉత్సవ సంక్షేమ సంఘం కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా జరిపిస్తుంది. టూరిజనికి ఉత్సవ కమిటీ పండగ చందా ఏర్పట్టు కోసం విశాఖ కార్యాలయం కు వెళితే కమిటీ సిబ్బందికి ముష్టి వేసినట్లుగా టూరిజం శాఖ 50, వేల రూపాయలు ఇచ్చి అందులో రెండు భాగాలుగా చేసి 40, వేల రూపాయలు ఇస్తామని చెప్పి శివరాత్రి జాతర తర్వాత మూడు నెలలు తిప్పి ముష్టి ఇస్తున్నారు. అలాగే 10 వేల రూపాయలు గైడ్ యూనియన్ కి ఇస్తున్నారు.
అది స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు ప్రజలకు అర్థం కావడం లేదు ప్రస్తుతం ఇది మన బొర్రా గుహలు టూరిజం యొక్క నిర్వకము , దౌర్భాగ్యము! మన ఆదాయం రాష్ట్రమంతటా ఖర్చు పంచిపెట్టి టూరిజం మనకు 40, వేల రూపాయలు ఉత్సవాలకు ముష్టి వేస్తున్న బొర్రా గుహలు టూరిజం యొక్క వైనం, స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగాలు అవకాశాలు ఇప్పటివరకు టూరిజం శాఖ కల్పించ లేదు, అదేవిధంగా బోర్రా ములియాగూడ జంక్షన్ నుండి బోర్రా గుహలు వరకు మూడు చోట్లలో టూరిజం శాఖ ద్వారా ముఖద్వారాలు పెట్టాలని ప్రతిసారి విన్నవించుకున్న పట్టీ పట్టనట్లుగా పర్యాటక శాఖ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా బొర్రా గుహలు లో వచ్చే ఆదాయం బొర్రా పంచాయతీ అభివృద్ధికి టూరిజం శాఖ పూర్తిగా సహకరిచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.