ఎట్టకేలకు ‘పెళ్లికానుక’నూ ప్రభుత్వం అమలు చేశారు. గతంలో ఉన్న చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని రద్దు చేసి జగన్ సర్కారు వైఎ్‌సఆర్ కల్యాణమస్తు పథకాన్ని ప్రారంభించింది. తాజాగా సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. గతంలో ఉన్న విదేశీ విద్య పథకాన్ని, మూడేళ్ల పాటు విద్యార్థులకు సాయం చేయకుండా, దాని స్థానంలో కొన్ని నిబంధనలతో ఇటీవల కొత్త పథకాన్ని జగన్ సర్కారు ప్రారంభించిన సంగతి తెలిసిందే.. దీనివల్ల గత ప్రభుత్వంలో కంటే చాలా తక్కువ మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. కల్యాణమస్తు పథకాన్ని కూడా ఇదే తరహాలో అమలు చేస్తున్నారు.ముస్లింలకు వైఎ్‌సఆర్ షాదీ తోఫా పేరుతో, మిగిలిన వారికి వైఎ్‌సఆర్ కల్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైఎ్‌సఆర్ కల్యాణమస్తు పేరుతో 2022 సెప్టెంబరు 10న అర్థరాత్రి జీఓ నెం.47 జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.