టీచర్లను అకడమిక్ విధులకు తప్ప వేరే వాటికి వినియోగించుకోదలచుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. దీంతో... ఎన్నికల విధులకు కేటాయించే ఉద్యోగుల డేటాబే్‌సలో 1.91 లక్షల మంది టీచర్లను తొలగించారు. వారి స్థానంలో 1.36 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను చేర్చారు. వలంటీర్లకే ఎన్నికల డ్యూటీలు వేయాలని ప్రయత్నించారు. కానీ... వలంటీర్లు పూర్తిస్థాయి ఉద్యోగులుకారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో... ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన సచివాలయ సిబ్బందిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే... ప్రతి సచివాలయంలో ఇద్దరు కార్యదర్శులను బీఎల్‌వోలుగా (బూత్‌లెవెల్ ఆఫీసర్) నియమించారు.