బాదం, వాల్ నట్స్, ఎండుద్రాక్ష వంటి వాటిని నానబెట్టుకుని తినడం చూస్తూనే ఉంటాం. కానీ పాలలో నానబెట్టిన జీడిపప్పు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట శుభ్రపడడమే కాకుండా మలబద్ధకం నివారిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, రోగ నిరోధక శక్తి పెరగడం సహా ఎముకలు గట్టి పడతాయంటున్నారు. పాలలో 3-5 జీడిపప్పులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ పాలను జీడిపప్పుతో కలిపి మరిగించి, తర్వాత వాటిని పాలతో కలిపి తింటూ తాగాలంటున్నారు.