రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామ సహాయకుల (వీఆర్‌ఏ)కు ముఖ హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) నుంచి మినహాయింపు ఇవ్వాలని రెవెన్యూశాఖ బాస్, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్‌కు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రెవెన్యూ గ్రామసహాయకులు అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నారని, వారి వద్ద కనీసం స్మార్ట్‌ఫోన్ కూడా ఉండదని సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యలను దృష్టిలోపెట్టుకొనే గతంలో ఆన్‌లైన్ బయోమెట్రిక్ హాజరు నుంచి వారికి మినహాయింపునిచ్చారని, ఇప్పుడు ముఖ హాజరు నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు.