కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లోని కాంట్రాక్టు బోధనా సిబ్బందికి 23శాతం జీతాలు పెంచినట్లు పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్ష డైరెక్టర్ ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి ఇటీవల కేబినెట్ అనుమతి లభించిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కేజీబీవీల్లో ఇంటర్ బోధిస్తున్న పీజీటీలకు సీఆర్టీలతో సమానంగా జీతాలు చెల్లిస్తామన్నారు.