శ్రీ సత్య సాయి జిల్లాలో 282 మందికి కల్యాణమస్తు, షాదీతోపా కింద రూ. 2. 23 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మెగాచెక్ను శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో డీఆర్డీఏ పీడీ నరసయ్య, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శివరంగప్రసాద్. లబ్ధిదారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ. ప్రతి మూడునెలలకోసారి లబ్ధిదారులకు వివాహమైన 30 రోజుల్లోగా స్థానిక వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనం తరం వారికి వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీతోఫా మంజూరవుతుందన్నారు.