రాజ్మా చావల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ లో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. రాజ్మాలో ఉండే డైటరీ ఫైబర్ కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. బీన్స్ త్వరగా అరగడంతో జీవక్రియ వేగం పెరిగి బరుగు తగ్గుతారు. రాజ్మాలోఉండే పొటాషియం కడుపుబ్బరం, వికారం వంటి వాటికి చెక్ పెడుతుంది. రాజ్మాతో పాటు బీన్స్‌లో ఉండే పోషకాలు, ఫైబర్లు క్యాన్సర్ వ్యతిరేక కారకాలుగా పనిచేస్తాయి.