‘యువగళం పాదయాత్ర దెబ్బకు వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి లండన్ మందులు కూడా పనిచేయడం లేదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో 18వ రోజు(సోమవారం) ఆయన తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలోని చినరాజకుప్పం, నారాయణవనం మీదుగా సత్యవేడు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. సాయంత్రం చినరాజకుప్పంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘జగన్ ఎంత పిరికివాడో మీకు చెప్పాలి. నన్ను ఆపేందుకు వెయ్యిమంది పోలీసులను, 20మంది ఎస్‌ఐలను, 10మంది సీఐలను, ఆరుగురు డీఎస్పీలను పెట్టాడు. నేను ఎక్కడ నడిస్తే అక్కడ 30 పోలీస్ వాహనాలు ముందు నడుస్తాయి. లోకేశ్ పాదయాత్రకు ఎంతమంది వచ్చారని గజగజ వణుకుతున్నాడు. నేనేం నక్సలైట్‌ను కాదు. ఎవ్వరికీ భయపడను. నా మైకు, వైర్లు లాక్కున్నా, చివరికి స్టూల్ లాక్కున్నా తగ్గేదే లేదు. మూడు సంవత్సరాల 8 నెలలుగా జగన్ ఏం పీకాడా? అని తలగోక్కున్నా. ఇప్పుడు అర్థమైంది. నా మైక్ పీకాడు. టెన్త్ ఫెయిలైన జగన్‌కే అంత ఉంటే, స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన నాకు ఎంత ఉండాలి ఆగ్రహం వ్యక్తపరిచారు.