ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముష్కరుల దాడికి నాగుగేళ్లు నిండాయి... పుల్వామాలో అమరులైన 40 మంది జవాన్లు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 12:40 AM

మనపై కొన్ని దుష్టకరపరిణామాలు ఎంతో ప్రభావం చూపుతాయి. జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో 14వ తేదీన పాకిస్థాన్ ఉగ్రవాదులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ప్రాణాలు తీశారు.


ఆత్మహుతి దాడిలో పాల్గొన్న కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి ఎడమవైపునకు ప్రవేశించాడు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.


సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది.. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ప్లాన్‌లో భాగంగా ఆత్మాహుతి దాడికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే ఉగ్రవాది అదిల్ పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోకి దూరి ఐదో బస్సును ఢీకొట్టాడు.


దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడం వారి మరింత అనుకూలించింది.


పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ దాడి బాధ్యతవహిస్తూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత రగిలిపోయింది.


పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను(URI surgical Strike) ఎంచుకుంది. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే మొదటిసారి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com