టర్కీలో నెలకొన్న భూకంపంతో వేలాది నివాసాలు నేలమటం అయ్యాయి. వేలాది మంది విగత జీవులుగా మారారు. ఈ క్రమంలోనే భవన శిథిలాల కింద కొందరు మృత్యుంజేయులుగా నిలుస్తున్నారు. ఇదిలావుంటే బోసి నవ్వులు చిందిస్తున్న ఈ బాలుడు ఇప్పుడు వరల్డ్ హీరో. భూకంప శిథిలాల కింద చిక్కుకొని 128 గంటలు గడిచిన తర్వాత కూడా మృత్యుంజయుడిలా బయటకి తిరిగొచ్చాడు. స్నానం చేయించి, పాలు పట్టగానే నవ్వులు చిందించాడు. భూకంపంతో కకావికలమైన టర్కీ, సిరియాలో వేలాది మంది మరణాల మధ్య ఇలాంటి కొన్ని ‘అద్భుతాలు’ ఆశలు రేపుతున్నాయి. 7 రోజుల పాటూ శిథిలాల కిందే ఉన్న మరో వ్యక్తిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకి తీసుకొచ్చింది. శిథిలాల మధ్య నుంచి సొరంగం తవ్వి, అతడిని రక్షించారు. భూకంపం శిథిలాల నుంచి రెండేళ్ల బాలిక, 6 నెలల గర్భిణీ, 70 ఏళ్ల మహిళను కూడా 5 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు టర్కీ మీడియా పేర్కొంది.
ఈ ఘటనలన్నింటి మధ్య టర్కీలోని హటే ప్రావిన్స్‌లో సుమారు 128 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకుపోయి కూడా క్షేమంగా బయటపడ్డ పసిబిడ్డ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ‘మిరాకిల్ బేబీ’ అంటూ సోషల్ మీడియాలో ఈ చిన్నారి వీడియోను షేస్తున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద దాదాపు 7 రోజుల పాటు చిక్కుకున్న ఓ యువకుడు, 62 ఏళ్ల మహిళను రెస్క్యూ టీమ్ కాపాడింది. ఈ ఘటన కూడా హటే ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. 163 గంటలకు పైగా శిథిలాల కింద చిక్కుకున్న ఏడేళ్ల ముస్తఫా, నఫీజ్ యిల్మాజ్‌ను సహాయక బృందాలు శనివారం అర్ధరాత్రి రక్షించాయి.
హటేలో 5 రోజులుగా శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వ్యక్తిని తీసుకొచ్చేందుకు, శిథిలాల ద్వారా తవ్విన సొరంగంలో రెస్క్యూ టీమ్ సభ్యుడు పాకుతూ వెళ్తున్న వీడియోను బ్రిటన్‌కు చెందిన రెస్క్యూ టీమ్ సభ్యుడు ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో టర్కీకి చెందిన వివిధ సంస్థల నుంచి 32,000 మంది, వివిధ దేశాల నుంచి 8,294 మంది పనిచేస్తున్నట్లు టర్కీ డిజాస్టర్ ఏజెన్సీ తెలిపింది.