ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...... అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి గతంలో మూడు రాజధానుల బిల్లు పెట్టామని, రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోందన్నారు. తమ వాదన వినిపిస్తున్నామని, ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే మంత్రి బుగ్గన చెప్పారన్నారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.