జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. తమకు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు.