జగన్ కోడి కత్తి కేసు మళ్ళి తెరమీదకి వచ్చింది. కోడికత్తి కేసు విచారణ బుధవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. బాధితుడు జగన్ , ప్రత్యక్షసాక్షి దినేష్, జగన్ పీఏ కేఎన్‌ఆర్ విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాడి సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు అసిస్టెంట్ కమాండ్‌ర్‌గా దినేష్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాయపూర్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోడికత్తి దాడి కేసులో దినేష్ మొదటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి మరణించడంతో గతంలో కేసు విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు కేసు విచారణ వేగవంతం చేయాలని నిందితుడు శ్రీనివాసరావు తరుపు న్యాయవాది సలీం ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.