మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కాస్త కష్టంగా గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన తన రెండో మ్యాచ్‌లో వెస్టిండీను చిత్తుచేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగా చేధించింది. మొదట దీప్తి శర్మ స్పిన్‌తో తిప్పేయగా అనంతరం రిచా, హర్మన్ భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేర్చింది.