నందమూరి తారకరత్నకు తారకరత్నకు ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేశారు. ఇదిలావుంటే తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. గురువారం తారకరత్నకు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. అయితే.. గురువారం చేసిన ఎంఆర్ఐ స్కానింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుడే తారకరత్న రోగ్యంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గతనెల 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. అదే సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన టీడీపీ నాయుకులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి.. ట్రీట్‌మెంట్ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు చేస్తున్నారు. మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.