రాష్ట్రంలో అధికారంలోకి రాభోయేది టీడీపీ ప్రభుత్వమేనని వచ్చిన వెంటనే ప్రజల కష్టాలు తీర్చేలా ముందడుగు వేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ స్థానిక 36 వ డివిజన్‌లో గురువారం సాయంత్రం చేపట్టిన ‘ఇదేమి ఖర్మ... మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... వైసీపీ పాలనతో ప్రజలు ముఖ్యంగా మహిళలు విసుగు చెందారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఈ సంఘటనలు తుగ్లక్ జగన్‌రెడ్డికి పట్టవా? అని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా కరెంట్ చార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను లు, చెత్తపై పన్నులు వేసి ప్రజలపై వీపరితమైన భా రాలను మోపుతున్నారని మండిపడ్డారు. మరలా టీడీ పీ అధికారంలోకి వస్తేనే సుభిక్షంగా ఉంటుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ నేతలు నవనీతం సాంబశివరావు, చలమలశెట్టి శ్రీనివాసరావు, ఇమ్మడి రాము, మద్దినేని సుబ్రమణ్యం, నందేటి లక్ష్మణ్‌సింగ్, బోను సుందరయ్య, కోడె ప్రభాకర్, రాణి మేకల గౌతం, నందేటి వేణుసింగ్ తదితరులు పాల్గొన్నారు.