ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు ఉండేది. అంతే కాకుండా అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగకూడదని, రిజిస్ట్రేషన్ కోసం ఫీజులు కూడా వసూలు చేయరాదని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.