అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్టం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్ కవర్ లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పాదదర్శకతను కొనసాగించాలని కోరుతున్నామని, కేంద్ర సూచనను అంగీకరించమని ధర్మాసనం పేర్కొంది. నిపుణుల కమిటీ సభ్యులపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.