తాను బూతులు మాట్లాడుతాను అని చెప్పేవాళ్లకి చంద్రబాబు, నారా లోకేశ్ మాటలు వినిపించడంలేదా అని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ... 'మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా? సీఎం జగన్ డీఎన్ఏ రాయలసీమది.. లోకేష్ డీఎన్ఏ తెలంగాణది. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు. ఒక ఎజెండా లేకుండా లోకేష్ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా?' అని కొడాలి నాని ప్రశ్నించారు.
'చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం జగన్ పండగ చేశారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలు ఎలా సంపాదించావు? ఎన్టీఆర్ వారసులు అందరూ సామాన్యుల్లా బతుకుతున్నారు. ఎన్టీఆర్ ఆస్తి అంతా నీకు పంచి ఇచ్చారా? రైతులను మోసం చేసి.. పేదలను సర్వనాశనం చేసిన 420 చంద్రబాబు. ఓ అవినీతి చక్రవర్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు' అంటూ.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం. తన అమ్మను ఏదో అవమానించారని లోకేష్ అంటున్నారు. కానీ చంద్రబాబే తన భార్యను అల్లరి చేశారు. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు తాము సిద్ధం. లోకేష్ వాళ్ల అమ్మ మాత్రమే ఆడదా.. భారతి కాదా. చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలి. నా నియోజకవర్గానికి రా... నువ్వో నేనో తేల్చుకుందాం. నన్ను లేదా వంశీనో టచ్ చేసి చూడు మీ సంగతి తేల్చుదాం. నేను దేనికైనా సిద్దం' అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు.