కరోనా లాక్ డౌన్ తర్వాత నుండి దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో దేశంలో యూపీఐ ద్వారా 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ ద్వారా ఏకంగా రూ.12,98,726 కోట్లు చేతులు మారి సరికొత్త రికార్డు నమోదయ్యింది. యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే(రూ.6,61,108 కోట్లు) అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత గూగుల్ పే(రూ.4,43,725 కోట్లు), పేటీఎం(రూ.1,39,673 కోట్లు) ఉన్నాయి.