హర హర శంభో శంకర అంటూ పొలతల క్షేత్రానికి చేరుకుంటున్న భక్తజనం. మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుండి వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తజనం ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, జీపులు, ద్విచక్ర వాహనాల ద్వారా భక్తజనం పొలతలకు చేరుకుంటున్నారు. శివపార్వతులను దర్శించుకునేందుకు కొలనులో స్నానం ఆచరించి భక్తిశ్రద్ధలతో క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం పొందుతున్నారు. అక్క దేవతలు ఆలయం వద్ద మహిళలు సంతానం కొరకు కొలనులో స్నానమాచరించి ఆలయం వద్ద వర పడ్డారు. బండి అన్న స్వామి ఆలయం వద్ద స్వామివారికి జంతువులను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆలయాలకు చేరుకోవడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యనిర్వాహణాధికారి మహేశ్వర్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంబటి రాజగోపాల్ రెడ్డి అని చర్యలు చేపట్టడం జరిగిందని తెలియచేశారు. డి. ఎస్. పి వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.