ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ చివరి స్పీచ్ విని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 11:58 AM

అభిమాన నేతలు దూరమైతే వారి చివరి మాట్లలను మనం తలుచుకోవడం సహజం. అలాంటిదే ప్రస్తుతం నందమూరి తారకరత్న చివరి మాటలను అందరూ నెమరేసుకొంటున్నారు. ఇదిలావుంటే నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటంబ సభ్యులతో పాటు, నందమూరి అభిమానులను, టీడీపీ శ్రేణుల్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆయన.. 39 ఏళ్ల వయసులో గుండెపోటుగు గురై ప్రాణాలు కోల్పోవటం అందర్ని కలిచివేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆయన ఇలా దూరం కావటంతోఅభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేసిన ఆయన.. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ పాలన దక్షత, మామయ్య చంద్రబాబు ఏపీ అభివృద్ధికి చేసిన కృషి, బాబాయ్ బాలయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెబుతూ ఆయన మాట్లాడారు. ఇదే ఆయనకు చివరి స్పీచ్ కాగా.. 'నా అడుగు జనాల వైపు.. నా చూపు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి వైపు' అంటూ ఆయన మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.


"రాష్ట్రంలో ప్రత్యర్థులు తనకు పోటీ కాదని ఎన్టీఆర్ డైరక్ట్‌గా కేంద్రంతో తలపడ్డాడు. దశబ్దాల పాటు ఏ ముఖ్యమంత్రి చేయని, చేయలేని సంస్కరణలు కేవలం ఏడేళ్లలో చేసి చూపించారు. ఆడవారికి ఆస్తుల్లో హక్కు, తాలుకాలు రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. తెలుగు దేశం మార్చిన భారతదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం. 1982లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో వేసిన పునాది.. నేడు పేద ప్రజలకు పెద్ద భవంతి. రైతన్న గుండెల్లో ఎన్టీఆర్ రామన్నగా నిలిచిపోయారు. మద్యపాన నిషేదం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.


ఈరోజు ఆయన కలలుగన్న ఆంధ్రరాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. మన భావి తరాల వారు సుఖంగా బ్రతకాలన్నా., ఆ రామరాజ్యాన్ని మళ్లీ తీసుకురావాలంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఈ రోజు నుంచి నా అడుగు జనాల వైపు.. నా చూపు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి వైపు ఉంటుంది. ఆ మహానుభావుడికి మనవడిగా, బాలయ్య బాబుకి అబ్బాయ్‌గా, చంద్రబాబు మామయ్యకు మేనల్లుడిగా, మీ ఆశీర్వాదాలే శ్రీరామ రక్షగా అడుగేస్తున్నా. చివరగా ఆయనకు అడ్డొస్తే సూర్యుడు.. అభిమానిస్తే చంద్రుడు. సూర్యుడైన, చంద్రుడైన, ఇంద్రుడైనా అంతా మా బాలయ్య బాబాయే." అంటూ నందమూరి తారకరత్న పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్‌ అక్కడున్న తెలుగు దేశం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.


ఇలా రాజకీయంగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే జనవరి 26 కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు హృదాయాలయం ఆసుపత్రికి తరలించారు. అక్కడి గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ.. శనివారం రాత్రి ప్రాణాలు విడిచారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా వెళ్లిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు ప్రజలతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa