రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాహేశ్వరరావు ఆరోపించారు. అనపర్తిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అడ్డుకున్నందుకు నిరసనగా రాష్ట్రకమిటీ పిలుపు మేరకు శనివారం సాంబమూర్తి రోడ్డులోని బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత అంబేద్కర్‌కు సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని, జగన్ బుద్ధి మారాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోందని, ఇది చాలా దుర్మార్గమన్నారు. చంద్రబాబును నిలువరించేందుకు మీకేం హక్కు ఉందని, టీడీపీ హయాంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే జగన్ పాదయాత్ర సజావుగా సాగేదా అని ప్రశ్నించారు.అధికారులు ప్రజల కోసం పనిచేయాలే తప్ప తాడేపల్లి ఆదేశాల కోసం పనిచేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఉమా అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డి.నాగరాజు, కె.రూ్‌పకుమార్, డి.వెంకటరావు, జి.కృష్ణమోహన్, డి.మురళీకృష్ణంరాజు, ఎల్.సాయిరాం గౌడ్, టి.శ్రీనివాసరావు, విజయలక్ష్మి, మౌల్య స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.