మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఆసక్తికర సంఘటన జరిగింది. భేరుఘాట్కి చెందిన రాజేంద్ర వివాహం జుల్వానియాకు చెందిన శివానితో ఈనెల 16న నిశ్చయమైంది. అయితే పెళ్లికి 3రోజుల ముందు శివాని ఓ ప్రమాదంలో గాయపడటంతో కాళ్లు, చేతులు విరిగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈనేపథ్యంలో 18న ఆస్పత్రిలోనే పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. దీంతో వధువు స్టెచ్చర్పై ఉండగానే ఆమె మెడలో వరమాల వేసి వివాహమాడాడు వరుడు.