ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలియజేసిన ఘటన యూపీలోని లక్నోలో జరిగింది. ఓ మహిళ తనను నిత్యం రౌడీలు వేధిస్తున్నారంటూ కాకోరీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న చెట్టు ఎక్కి నిరసన తెలియజేసింది. ఆమెను కిందకి దిగమంటూ పోలీసులు బ్రతిమాలడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.