అమరరాజా బ్యాటరీ పరిశ్రమ కాలుష్యం కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కంపెనీ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరరాజా పరిశ్రమ తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తుంది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల నీళ్లలో సీసం స్థాయిలు పెరుగుతున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.