ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. ఈ మేరకు రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది.మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్లను ట్యాక్సీలుగా ఉపయోగించడం నిషేధమని, బైక్ ట్యాక్సీలు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఏడాదిపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది.