రోడ్లపై కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వేరే వాళ్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ SUV కారు రిక్షాను ఢీకొట్టి, రిక్షా తొక్కుతున్న వ్యక్తిని 150 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో రిక్షా తొక్కుతున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదం యూపీలోని లక్నోలో జరిగింది.