ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలు, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణ నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.