బాలీవుడ్ ప్రాముఖ గాయకుడు సోను నిగమ్‌పై దాడి జరిగింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌లో అభిమానులు సెల్ఫీల కోసం ఎగపడ్డారు. ఈ క్రమంలోనే సోను నిగమ్‌పై దాడి జరిగింది. అలాగే అతని సహాయకులలో ఒకరిని వేదికపై నుంచి కూడా తోసేశారు. రాత్రి 11 గంటలకు చెంబూర్‌లో సోనూ నిగమ్ తన లైవ్ పర్ఫార్మెన్స్ తర్వాత స్టేజి దిగుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన అతని సహాయకుడిని ఆసుపత్రి ప్రాథమిక చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు.
"నన్ను నెట్టడంతో నేను మెట్లపై పడిపోయాను. రబ్బానీ (ఖాన్) నన్ను రక్షించడానికి వచ్చి వెనుక నుంచి రాగ.. అతన్ని కిందికి నెట్టారు. ఎవరైనా సెల్ఫీ తీసుకోమని బలవంతం చేసినప్పుడు దాని గురించి ఆలోచించాలి కాబట్టి నేను ఫిర్యాదు చేసాను." నిగమ్ విలేకరులతో అన్నారు. సోను నిగమ్ పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"చెంబూర్ ఫెస్టివల్‌లో సోనూ నిగమ్ తన లైవ్ పర్ఫార్మెన్స్ తర్వాత స్టేజ్ నుండి బయటకు వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అతన్ని ఎవరో వెనుక నుంచి ఆపారు. గాయకుడితో పాటు ఇద్దరు వ్యక్తులు అతన్ని పక్కకు తరలించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వ్యక్తి వారిని మెట్లపైకి నెట్టారు.వారిలో ఒకరికి గాయాలయ్యాయి" అని సీనియర్ పోలీసు అధికారి హేమ్‌రాజ్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. ఈ ఘటనలో అభియోగాలు స్వప్నిల్ ఫాటర్‌పేకర్ అదుపులోకి తీసుకున్నారు.
"నిగమ్‌తో మాట్లాడాం.. ఉద్దేశపూర్వకంగా ఏమీ అనిపించలేదు. ఇది ఆకస్మికంగా, ఒక వ్యక్తి వల్లే జరిగింది. అక్కడ ఉన్న వాలంటీర్లు పరిస్థితిని పరిష్కరించారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఫోటో తీయడం లేదా మీడియా ఫుటేజీ కోసం కావచ్చు. దీనిపై విచారణ జరుపుతాం" అని రాజ్‌పుత్ అన్నారు.