ముఖ్యమంత్రి జగన్ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగును పూర్తిగా దూరం చేయడంతో పిల్లలకు తెలుగు రాయలేని, ఇంగ్లీషు మాట్లాడలేని దుస్థితి వస్తుందని మండిపడ్డారు. మాతృభాష ఉద్యమాన్ని మన రాష్ట్రంలో కూడా నిర్వహించి, దానికనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోమవారం లేఖ రాశారు. మాతృభాషా దినోత్సవాన్ని మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ‘బహు భాషా విద్య’ అనే థీమ్‌తో యునెస్కో నిర్వహిస్తున్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమని శ్రీనివాసరావు తన లేఖలో పేర్కొన్నారు.