‘‘జగన్‌కు వ్యతిరేకంగా.. ఓ వర్గం చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనం మనసుల్లో జగన్ ఉన్నంత కాలం ఎవరేం చేసినా ఏం కాదు. జగన్‌కు వ్యతిరేకంగా కమ్మోళ్లందరూ ఒకటి కాలేదు.. ఆ నలుగురే (చంద్రబాబు.. ముగ్గురు మీడియా పెద్దలు) ఒకటయ్యారు. నేనూ కమ్మవాణ్నే.. జగన్ వెనుక కమ్మవాళ్లు ఎంత మంది ఉన్నారంటే చెప్పడం కష్టం. కానీ ఇలాంటి మీడియా.. ఇలాంటి రాజకీయాల్లో ఇన్వాల్ అయితే.. చంద్రబాబు ఇలాంటి రాజకీయా విన్యాసాలు చేస్తే.. ఆంధ్రా బిహార్ కంటే.. అప్ఘానిస్థాన్ కంటే డేంజర్‌గా తయారవుతుంది. అలా తయారు చేయడానికి చంద్రబాబు వంద శాతం సిద్ధపడతాడు’’ అని పోసాని వ్యాఖ్యానించారు.