చంద్రబాబు పోలవరం కట్టకుండానే డ్రామాలు ఆడాడని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ ఆరోపించారు. బాబు చెక్క భజన కోసం రూ.250 కోట్లు ఖర్చు చేశాడని విమర్శించారు. ఇలాంటి డ్రామాలు జగన్కు చేతకావన్న ఆయన.. చంద్రబాబు పనులు చేయకుండానే పబ్లిసిటీ చేసుకున్నాడని.. కానీ జగన్ చేసిన పనులనే పబ్లిసిటీ చేసుకున్నాడన్నారు. పబ్లిసిటీ అనేది పర్పస్ఫుల్గా ఉంటే తప్పు లేదని అభిప్రాయపడ్డారు. జైలుకు వెళ్లాల్సిన క్రైమ్ చంద్రబాబు చేశాడు. కానీ జగన్ జైలుకు వెళ్లాడంటూ పోసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.