వేసవి కాలంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగుతాయి. మీ చర్మంలో అధికంగా ఉన్న నూనె బయటకు వస్తోంది. దీంతో చర్మం తాజాగా ఉంటుంది. ఈ కాలంలో మొటిమలను నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే.. బెర్రీలు, నట్స్, ఓట్స్, బార్లీ, ఆపిల్, క్యారెట్, అవిసె గింజలు, జామకాయ, తృణధాన్యాలు చేర్చుకోండి. ఇవి చర్మంలో వ్యర్థాలు పేరుకోకుండా కాపాడతాయి.