మీరు జట్టుకు వేసే రంగు నాలుగురోజులు పదిలంగా ఉండాలంటే ఇలా చేయండి అంటున్నారు బ్యూటీషియన్లు. ఈ రోజుల్లో జుట్టుకు రంగు వేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. కొందరు తెల్ల జుట్టును కవర్ చేయడానికి నల్ల రంగు వేస్తుంటే.. మరికొందరు స్టైల్ కోసం జుట్టుకు రకరకాల రంగుల వేసేస్తున్నారు. అయితే జుట్టుకు రంగు వేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా జుట్టుకు రంగు ఎక్కువకాలం పట్టి ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
జుట్టుకు రంగు వేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు.. వారం పదిరోజుల ముందు నుంచే తలకు ఎలాంటి కెమికల్ ప్రాడెక్స్ వాడకపోవడమే మేలు. డై వేసే మూడు రోజుల ముందు కండిషనర్ పెట్టి తలస్నానం చేయండి. ప్రొటీన్లు అధికంగా ఉండే కండిషనర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి హెయిర్ కలర్ పోకుండా రక్షిస్తుంది.
డై కొనేప్పుడు.. అమ్మోనియా, సల్ఫేట్ ఫ్రీవి కొంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మీరు హెయిర్ కలర్ వేసుకునే ముందు.. చెవి ముందు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేయండి. కళ్ల మంట, అలర్జీలు వస్తే.. దాన్ని వాడటం మానేయాలి.
జుట్టుకు రంగు వేసుకునేప్పుడు.. రంగు తలకు తగలకుండా చూసుకోండి. స్కాల్ప్‌కు రంగు అంటితే.. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జుట్టుకు రంగు వేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్, నూనె రాసుకోండి. ఇలా చేస్తే ముఖానికి రంగు అంటినా.. త్వరగా వదులుతుంది.
తలకు డై వేసుకున్న తర్వాత.. మరీ వేడి నీళ్లతో తలస్నానం చేయవద్దు. వేడి నీళ్లు కుదుళ్లు తెరుచుకునేలా చేస్తాయి. దీని వల్ల రంగు త్వరగా పోతుంది.
తలస్నానం చేసేటప్పుడు మామూలు షాంపూ బదులు కలర్ ప్రొటెక్ట్ చేసే షాంపూ వాడండి. ఇది హెయిర్ పీహెచ్‌ని కాపాడుతుంది. తలస్నానం చేశాక జుట్టుకు కండీషనర్ అప్లై చేయండి. జుట్టు ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్ వాడొద్దు.
జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత రోజూ తలస్నానం చేయవద్దు. ఇలా రోజూ స్నానం చేస్తే.. రంగు త్వరగా పోయే అవాకశం ఉంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.