నేటి నుండి కాంగ్రెస్ 85వ ప్లీనరీ జరగనుంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో నేటి నుండి మూడు రోజులపాటు ఈ ప్లీనరీని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ఏడాదిలో 8 రాష్ట్రాల ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఇతర పార్టీలతో పొత్తులపై మేధోమథనం నిర్వహించనున్నారు.