మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఈనెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను మార్కెట్ కు తీసుకొచ్చాడు. వ్యాపారులు ధర లేదంటూ కిలో రూపాయికి కొన్నారు. మొత్తం 512 కిలోల ఉల్లిగడ్డలకు రూ.512 రాగా, అందులో రవాణా, కూలీ, ఇతర ఖర్చుల కింద రూ.509.51 పోయాయి. రూ.2.49 మిగలగా రౌండ్ ఫిగర్ గా రూ.2 చెక్కును ఇచ్చారు. దీంతో రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.