పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగులపై వేధింపులు ఆపాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ కర్నూలు డివిజన్ కార్యదర్శి గిరిబాబు అన్నారు. గురువారం పాతబస్టాండు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గిరిబాబు మాట్లా డుతూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులు చేసిన ఒత్తిడి కారణంగా మచిలీపట్నం డివిజన్ పామర్రు డివిజన్ సబ్ పోస్టు మాస్టర్ ఎస్.రవిప్రసాద్ మృతి చెందారని ఆరోపించారు. ఉన్నతాధికా రులు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చకుండా లక్ష్యాలను పూర్తి చేయాలని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. తపాలా శాఖ మనుగడ సాగిస్తోందంటే కిందిస్థాయి ఉద్యోగుల పని చేయడం వల్లే అన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజలను సేవలు అందించిన ఘనత కిందిస్థాయి ఉద్యోగులకే దక్కుతుందన్నారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌పీఈ రీజినల్ రెప్రజెంటేటివ్ కే.ఈశ్వరయ్య, నాయకులు శమంతకరెడ్డి, వెంకటేస్‌నాయక్, శివకుమార్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.