విశాఖ పశ్చిమ నియోజకవర్గం 52 వ వార్డలో విశాఖ నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వార్డు పరిసర ప్రాంతాలలో విశాఖ నగరపాలక సంస్ధ చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు.ఈసందర్భంగా శాంతీనగర్ అంబేద్కర్ నగర్, ఉడా లే అవుట్ ప్రాంతాలోల చివరి దశకు చేరుకున్న బీ. టి రోడ్డు పనులను కరాస హిందూ ముస్లీం క్రైస్తన శ్మశాన వాటికను ఆయన సందర్శించారు.
అక్కడి పనుల వివారాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతు సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో శ్మశాన వాటిక పనులు యుద్ద ప్రాతిపదికన జరిపిస్తున్నామన్నారు. అన్ని రంగాలలో వార్డును అభిృద్ది చేసి 98 వార్డులలో 52 వ వార్డును మోడల్ వార్డుగా తీర్చి దిద్దుతామని శ్రీధర్ పేర్కొన్నారు.