ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు విశాఖ విమానాశ్రయంలో ఘణంగా స్వాగతం లభించింది.ఈ మేరకు మహ విశాఖ నగర పాలక సంస్ధ డిప్యూటీ మేయర్ శుక్రవారం నగరానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. శ్రీధర్ స్వాగతం పలికిన వారిలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు , పంచాయితి రాజ్ శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు విశాఖ నగరపాలక సంస్ధ కమీషనర్ పి. రాజాబాబు ఉన్నారు.